డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్..
- January 22, 2026
మంచు మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు పవర్‌ఫుల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ పేరు ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాపై ఇప్పటికే గట్టి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల మనోజ్ సోషల్ మీడియా ద్వారా కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2026 జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది.
ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాకు సంబంధించిన టోన్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ముఖంపై రక్తంతో నిండిన గుడ్డ, కళ్లలో కనిపించే ఆగ్రహం – ఈసారి మనోజ్ పూర్తిగా మాస్, వైలెంట్ పాత్రలో కనిపించబోతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ (Manchu Manoj) సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం బాధ్యతలను Ravi Basrur నిర్వహిస్తున్నారు.
మనోజ్ చేసిన “BRUTAL ERA BEGINS” అనే పోస్టు చూస్తే, ఈ సినిమా యాక్షన్ పరంగా కొత్త స్థాయిలో ఉండబోతుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు అందరి చూపూ జనవరి 26న విడుదలయ్యే ఫస్ట్ లుక్‌పైనే ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







