గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- January 23, 2026
మనామా: బహ్రెయిన్ - కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్ గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు.
కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్-ఖుదైబియా ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్‌లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్-మాలికి, బహ్రెయిన్‌లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్-బన్నావ్ మరియు ఇరువైపుల నుండి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక







