మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- January 26, 2026
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశభక్తి స్ఫూర్తితో పాటు భారత ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛార్జ్ డి అఫైర్స్ తవిషి బెహల్ పాండే.. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం భారత జెండాను ఆవిష్కరించారు. ఇండియన్ స్కూల్ మస్కట్ విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఛార్జ్ డి అఫైర్స్ భారత రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఇందులో భారతదేశ పురోగతి, ప్రజాస్వామ్య విలువలు మరియు భవిష్యత్ ఆకాంక్షలను హైలైట్ చేశారు.
పోర్బందర్ నుండి మస్కట్కు ఐఎన్ఎస్వి కౌండిన్య తొలి సముద్రయానం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, కమాండర్ వై. హేమంత్ మరియు కమాండర్ వికాస్ షియోరాన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







