టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- March 16, 2026
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు రూ. 118.89 కోట్ల నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో సుమారు 21,580 మంది విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అత్యాధునిక హాస్టల్ బ్లాకులు మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు వేడినీళ్లు, నాణ్యమైన వంట సామగ్రి వంటి కనీస వసతులను మెరుగుపరుస్తూనే, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. ముఖ్యంగా శ్రీపద్మావతి మహిళా విద్యాసంస్థల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బోధన సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలను పెంచనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







