ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- March 16, 2026
ఒడిశా: ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ నగరంలోని ఎస్‌సీబీ (SCB) మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మంది రోగులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు ఐసీయూ లోపల మరణించగా.. మరో ముగ్గురు సహాయక చర్య సమయంలో ఇతర వార్డులకు తరలిస్తుండగా మరణించారు. 11మందికి గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాద ఘటన పై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంను సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







