హీరోయిన్ ఈషా రెబ్బా తో మాగల్ఫ్ ముఖాముఖీ

- January 26, 2026 , by Maagulf
హీరోయిన్ ఈషా రెబ్బా తో మాగల్ఫ్ ముఖాముఖీ

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్  'ఓం శాంతి శాంతి శాంతిః.ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా  విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

కొంత గ్యాప్ తర్వాత మీ నుంచి సినిమా వస్తుంది..ఈమధ్య కథల విషయంలో సెలెక్టివ్ గా ఉంటున్నారా?  
-కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే. నా లాస్ట్ మూవీ సినిమా సరిగ్గా వర్కౌట్ కాలేదు. నాలి చెప్పిన కథ, పాత్ర  సినిమాలో ఫైనల్ గా ఉంటుందని నమ్మకం కుదిరిన తర్వాతే చేద్దామని అనుకున్నాను. అలా నమ్మకంగా కుదిరిన కథ ఇది.

ఇది రీమేక్ కదా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
-చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా ఒరిజినల్ నాకు చాలా ఇష్టం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చుతుంది. ఇది అందరూ యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే స్టోరీ.

-మన తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే ఎమోషన్స్ అందరు కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి.సినిమా చూస్తున్నప్పుడు రీమేక్ అనే ఫీలింగ్ రాదు. ఇందులో అన్ని క్యారెక్టర్స్ కి ఆడియన్స్ రిలేట్ అవుతారు.

-నాకు శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలని అనుకునేదాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ సినిమాకి హండ్రెడ్ పెర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను.  

-ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇందులో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని చాలా ఫన్నీగా అలాగే ఎంటర్టైనింగ్ గా చెప్పడం జరిగింది.ఎక్కడ కూడా మెసేజ్ ఇచ్చినట్లుగా ఉండదు.

ట్రైలర్ లో చెంప దెబ్బలు కనిపించాయి..నిజంగానే కొట్టారా?  
-కొంచెం యాక్షన్ ఉన్న సినిమాలని ఇష్టపడతాను. ఇందులో చెంప దెబ్బలు ఉన్నాయి. ఒక దెబ్బ చెంపకి తగిలేలా ఉండాలి.చట్నీ చెంపకి అంటుకునేలా ఒక సీన్ ఉంది.అది రావాలంటే ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఆ రకంగా నిజంగానే గట్టిగా ఒక చెంప దెబ్బ తగిలింది( నవ్వుతూ). ఆ సీన్ లో నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు రియల్.ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్ లో తరుణ్ కి నాకు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. కోవిడ్ సమయంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.

గోదారి యాస పలకడం ఎలా అనిపించింది?  
-నాకు యాస విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా అమ్మది రాజమండ్రి. నేను సమ్మర్ హాలిడేస్ కి ప్రతిసారి అక్కడికి వెళ్ళేదాన్ని.అయితే తరుణ్ కి యాస ఒక ఛాలెంజ్. ఆయన చాలా యాస కోసం చాలా శ్రమించారు.ఎందుకంటే ఇప్పటివరకు అయినా తెలంగాణ తప్పితే మరో యాస పాత్రలు చేయలేదు.ఈ సినిమాకు మాత్రం చాలా కష్టపడ్డారు. అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చింది.తెరపై మీకు ఓంకార్ నాయుడు పాత్ర మాత్రమే కనిపిస్తుంది.  

-మంచి సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ చేసాము. చాలా వేడి వాతావరణం ఉండేది.ఆ వేడి పెద్ద చాలెంజ్ అనిపించలేదు.ఎందుకంటే నాకు చిన్నప్పటినుంచి ఆ ప్రాంతం అలవాటే. కాకపోతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒక సీన్ చేసాము.నాకు నీళ్లంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా భయపడ్డాను.అయితే మానిటర్లో చూసుకున్న తర్వాత సీన్ చాలా అద్భుతంగా వచ్చింది.

-తరుణ్ భాస్కర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.ఆయన స్వతహాగా దర్శకుడు. అయితే ఈ సినిమా వరకు మాత్రం ఆయన ఫోకస్ మొత్తం నటనపైనే వుంది.ఏ రోజు కూడా ఆయన దర్శకుడికి సలహాలు, మానిటర్ చూడటం నేను చూడలేదు.

మీ కెరీర్ లో దాదాపుగా అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు కదా?  
-నాకు అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం.అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, బ్రాండ్ బాబు, త్రీ రోజెస్ ఇలా ప్రతి సినిమా తీసుకుంటే దేనికవే ప్రత్యేకమైన పాత్రలు.  

ఈ సినిమా దర్శన రాజేంద్రన్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా..ఇప్పుడు ఆమె చేసిన పాత్ర చేశారు? ఎలా అనిపిస్తుంది?
 
-ఒరిజినల్ చాలా పెద్ద హిట్టు. దర్శన చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా చేస్తున్నానని దర్శనాకి మెసేజ్ చేశాను. చాలా ఆనందంగా ఉంది తప్పకుండా నువ్వు అద్భుతంగా చేస్తావని తను మెసేజ్ పెట్టింది. ఆ పాత్రని నేనైతే ఎలా చేస్తానో,దర్శకుడు ఈ పాత్ర నుంచి ఏం కోరుకుంటున్నాడో దాని ప్రకారమే చేశాను.

శాంతికి మీకు వున్న సిమిలారిటీస్ ఏమిటి?  
-పోలికలు తక్కువే. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం వేరు, నేను వేరే వాతావరణం వేరు.  తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అవసరమైతే ఫైట్ చేస్తుంది.నేను అలా ఫైట్ చేయలేను(నవ్వుతూ)

దర్శకుడు సజీవ్ గురించి?
-సజీవ్ కి  క్లియర్ విజన్ ఉంటుంది.అనుకున్నది కచ్చితంగా చేస్తాడు. చాలా మొండి. తను అనుకున్నది స్క్రీన్ పై తీసుకురావడానికి చాలా కష్టపడతాడు. అందరినీ కన్విన్స్ చేస్తాడు. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఈ కథకి 100 శాతం న్యాయం చేశాడు.

కొత్తగా చేయబోతున్న ప్రాజెక్ట్స్?
-ఒక రెండు కథలు విన్నాను. ఒక తమిళ్ సినిమా జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com