బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!

- January 27, 2026 , by Maagulf
బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!

మనామాః బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ఐదవ ఎడిషన్ అధికారికంగా పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ టోర్నమెంట్, ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చే దేశంగా బహ్రెయిన్ ఖ్యాతిని హైలైట్ చేస్తుందని టోర్నమెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అల్సాయెద్ తెలిపారు. ఈ సంవత్సరం బహ్రెయిన్‌లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎడిషన్‌లో టాప్ 100లో స్థానం పొందిన ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారని, ఇది టోర్నమెంట్ ఆకర్షణను పెంచుతుందని టోర్నమెంట్ నిర్వాహకురాలు కెప్టెన్ సఫియా అల్హాజేరి వెల్లడించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com