గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- January 27, 2026
దుబాయ్ః యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లో జరుగుతున్న గల్ఫ్ఫుడ్ 2026 ప్రదర్శనను సందర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఈ వేదికలో 10 బిలియన్ దిర్హమ్ల విలువైన విస్తరణ పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొదటిసారిగా గల్ప్ ఫుడ్ ఈవెంట్లో కొంత భాగం ఎక్స్పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ (DEC)లో జరుగుతుండగా, మిగిలిన భాగం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 195 దేశాల నుండి 8,500 కంపెనీలు పాల్గొని 1.5 మిలియన్లకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







