ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!

- January 28, 2026 , by Maagulf
ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!

మనామా: ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు సేవలు అందించేలా పునరుద్ధరణ చేయాలనే  ప్రతిపాదనను బహ్రెయిన్ ప్రతినిధుల మండలి మెజారిటీ ఓటుతో ఆమోదించింది. ప్రతిపాదికను పరిశీలించి సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను ఎంపీలు హమద్ అల్ డోయ్, అబ్దుల్వాహిద్ ఖరాటా, బాదర్ అల్ తమిమి, హిషామ్ అల్ అవధి మరియు డాక్టర్ హిషామ్ అల్ అషీరి సమర్పించారు. కేంద్రంలో పని గంటల తగ్గింపు తర్వాత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై  ఒత్తిడి పెరిగిందని వారు పేర్కొన్నారు.  

మరోవైపు, కింగ్ హమద్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో వేచి ఉండే సమయం సగటున రెండు నుండి మూడు గంటల నుండి ఐదు నుండి ఏడు గంటల వరకు పెరిగిందని తెలిపారు. బు మహర్‌లోని అల్ హలా ఆరోగ్య కేంద్రం పనిచేస్తున్నప్పటికీ, ఉత్తర ముహర్రక్ నివాసితులకు, ముఖ్యంగా వృద్ధ రోగులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com