30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- February 02, 2026
కంపెనీల AI డేటా-సెంటర్ విస్తరణకు అమెరికా బ్యాంకులు నిధులు సమకూర్చడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో.. టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యూహాత్మక వ్యయ నిర్మాణాన్ని తిరిగి సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే తమ వర్క్ ఫోర్స్ నుంచి 20 వేల నుంచి 30 వేల వరకు తగ్గించడానికి రెడీ అయింది. అలాగే తన కొన్ని వ్యాపార విభాగాలను విక్రయించడం వంటి కీలక నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ TD కోవెన్ వెల్లడించింది. ఈ చర్యలు ఒరాకిల్ చేపట్టనున్న భారీ AI మౌలిక సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
TD కోవెన్ రూపొందించిన పరిశోధనా నివేదిక ప్రకారం.. ఉద్యోగాల కోత ద్వారా ఒరాకిల్‌కు సుమారు 8 బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు ప్రవాహం సేవ్ కావచ్చు. ఇదే సమయంలో 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆరోగ్య సంరక్షణ సాఫ్ట్‌వేర్ యూనిట్ ‘సెర్నర్’ విక్రయాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విక్రయం జరిగితే ఒరాకిల్‌కు తక్షణ మూలధన అవసరాలను తీర్చుకునే అవకాశం లభించవచ్చని అంచనా. అయితే, ఈ నిర్ణయాలకు ప్రధాన కారణం ఒరాకిల్‌కు అనుబంధంగా ఉన్న డేటా-సెంటర్ ప్రాజెక్టుల రుణాల విషయంలో అనేక అమెరికా బ్యాంకులు వెనక్కి తగ్గడమే. ఈక్విటీ, డెట్ ఇన్వెస్టర్లు ఇద్దరూ, ఈ భారీ స్థాయి డేటా-సెంటర్ నిర్మాణాలకు అవసరమైన నిధులను ఒరాకిల్ స్వయంగా సమకూర్చగలదా అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని TD కోవెన్ నివేదిక స్పష్టం చేసింది.
సంస్థ మౌలిక సదుపాయాల నిబద్ధతల స్థాయి కారణంగా ఫైనాన్సింగ్ సవాళ్లు తలెత్తాయని..మొత్తం అవసరమైన మూలధన వ్యయం సుమారు 156 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన ఈ తిరోగమనం ఒరాకిల్ రుణ ఖర్చులను గణనీయంగా పెంచింది. సెప్టెంబర్ నుంచి డేటా-సెంటర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కోసం రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేటు ప్రీమియంలు దాదాపు రెట్టింపు అయ్యాయని, ఇవి సాధారణంగా తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలకు వర్తించే స్థాయికి చేరాయని TD కోవెన్ తెలిపింది. ఈ అధిక రుణ వ్యయాలు అనేక ఒప్పందాలను నిలిపివేయడానికి దారితీశాయి. ప్రైవేట్ డేటా-సెంటర్ ఆపరేటర్లతో ఒరాకిల్ చర్చలు జరుపుతున్న లీజులు ఫైనాన్సింగ్ పొందడంలో విఫలమవుతున్నాయని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







