భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

- February 02, 2026 , by Maagulf
భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

న్యూ ఢిల్లీ: బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు.ఈసారి రైల్వే బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు గణనీయమైన నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. తమిళనాడుకు రూ.7,611 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.5,454 కోట్లు, కర్ణాటకకు రూ.7,748 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

అదేవిధంగా దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. చెన్నై–హైదరాబాద్, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ ‘డైమండ్ కారిడార్’ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కారిడార్‌లు దక్షిణ భారత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా రెండో దశలో 7 కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బుల్లెట్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు ఉండనుందని, ప్రపంచస్థాయి సాంకేతికతతో ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తాయని తెలిపారు. హైస్పీడ్ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com