బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- February 03, 2026
యూఏఈ: గత సంవత్సరం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రతి టెక్నికల్ సమస్యలను సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో సమస్య ఉందని ఒక పైలట్ రిపోర్టు చేసిన నేపథ్యంలో సోమవారం తమ బోయింగ్ డ్రీమ్‌లైనర్‌లలో ఒకదాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాన్ని నిలిపివేసామని, పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నిపుణులతో వెంటనే తనిఖీలు చేయించామని ఎయిర్‌లైన్ వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థకు తెలియజేసినట్లు తెలిపింది.
గత సంవత్సరం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఆదేశాల తర్వాత సోమవారం తమ వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాలలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం జూన్‌లో ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించినప్పటి నుండి టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యంలోని క్యారియర్ విమానాల తనిఖీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







