కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- February 03, 2026
కువైట్: కువైట్ అంతటా మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ యాక్టింగ్ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ సమయంలో సముద్రపు అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
కాగా, మంగళవారం అర్ధరాత్రి తర్వాత వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని, వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 మరియు 30 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 10 మరియు 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని వెల్లడించారు. ఇక బుధవారం ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 21 నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 9 మరియు 11 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







