అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- August 08, 2026
మస్కట్: ఒమాన్‌లోని ధోఫార్ గవర్నరేట్ పరిధిలో ఉన్న అల్ హల్లానియత్ దీవుల సమీపంలో "కరోలైన్ బెజెంగీ (CAROLINE BEZENGI)" అనే నౌక ఒడ్డుకు చేరి నిలిచిపోవడంతో, పర్యావరణంపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టినట్లు ఒమాన్ రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ అథారిటీ వెల్లడించాయి.
ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో సమన్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సముద్ర పర్యావరణం లేదా నౌకాయాన భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తినా అత్యవసర కార్యాచరణ ప్రణాళికల ప్రకారం వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు సిద్ధంగా ఉన్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపగ్రహ చిత్రాలు, క్షేత్రస్థాయి సర్వేలు, సాంకేతిక నమూనాల ఆధారంగా పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ, ఎదురయ్యే సవాళ్లను గుర్తించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టాలు, ఒప్పందాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అధికారిక మార్గాల ద్వారానే వెల్లడిస్తామని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







