'బైకర్' నుంచి పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్
- February 04, 2026
చార్మింగ్ స్టార్ శర్వా హై-ఆక్టేన్ స్పోర్ట్స్-ఫ్యామిలీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ – ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కుపైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. “ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే” అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్‌లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు.
గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. ఆ పాత్రకు రాజశేఖర్ ఇచ్చిన ఇంటెన్సిటీ, తపన, ఎమోషనల్ డెప్త్ ఆ ప్రయాణాన్ని మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి.
రాజశేఖర్ ఫియర్స్‌గా, మాగ్నెటిక్‌గా కనిపిస్తూ ప్రతి ఫ్రేమ్‌కు వెయిట్ తీసుకొచ్చారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర క్రియేట్ చేసిన హై-ఇంపాక్ట్ క్యారెక్టర్‌కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్‌లా నిలుస్తుంది.
శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమా సినిమాలో శర్వా డేరింగ్& డాషింగ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. శర్వా చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్రిప్పింగ్ పెర్ఫార్మెన్స్ టీజర్‌లో ఇప్పటికే ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్, సంగీతం: గిబ్రాన్, ఎడిటింగ్: అనిల్ కుమార్ పి, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్: ఎన్. సందీప్, ఆర్ట్ డైరెక్టర్ ఎ. పన్నీర్ సెల్వం.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







