భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- February 04, 2026
ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్‌లో భాగంగా బేస్ ఛార్జీల పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.ఈ సేల్ ఫిబ్రవరి 5 వరకు బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీ ఫిబ్రవరి 11 నుంచి డిసెంబర్ 31 లోపు ఉండాలి. దేశీయ వన్-వే ఛార్జీలు రూ.1,499 నుండి, అంతర్జాతీయ ఛార్జీలు రూ.5,033 నుండి ప్రారంభమవుతాయి. ఇండియా-జురిచ్ రూ.46,000, ఇండియా-సిడ్నీ రూ.46,699 వంటి ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా నేరుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటే సౌలభ్య ఛార్జీలు ఉండవు. SBI, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో పాటు UPI, నెట్ బ్యాంకింగ్‌తో బుకింగ్‌లపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదనంగా, అనుమతి పొందిన ట్రావెల్ ఏజెంట్లు, విమానాశ్రయ టికెటింగ్ కార్యాలయాలు, కాంటాక్ట్ సెంటర్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అంటే మందుగా బుక్ చేసుకొని వెళ్లిన వారికి టికెట్ లభించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నగరాన్ని బట్టి టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
ఇదిలా ఉండగా..ఎయిర్ ఇండియా సంస్థ ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా దాదాపు 90 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్) 300కు పైగా విమానాలతో 55 దేశీయ, 45 అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందిస్తోంది. ముంబై-ఢిల్లీ వంటి రద్దీ మార్గాల్లో అధిక సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. ఈ నమస్తే వరల్డ్ సేల్ ప్రయాణికులకు గణనీయమైన ఆదా కల్పించే అవకాశంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!







