సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- September 20, 2026
మనామా: సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా కొనసాగిస్తున్న దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రియాద్‌తో పాటు బిష్, తాయిఫ్, ఫరాసాన్, యన్బు నగరాల్లో పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అలాగే సంబంధిత యూఎన్ భద్రతా మండలి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని బహ్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.
సౌదీ అరేబియాకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. దేశ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు పౌరులు, నివాసితుల రక్షణ కోసం సౌదీ తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలిపింది. యూఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. సౌదీ భద్రత, స్థిరత్వం బహ్రెయిన్ జాతీయ భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. హౌతీలు రియాద్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసిన రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ దళాల సామర్థ్యాలను కూడా ప్రశంసించింది.
హౌతీల దాడులను నిలిపివేసేందుకు యూఎన్ భద్రతా మండలి తన బాధ్యతలను నిర్వర్తించాలని బహ్రెయిన్ మరోసారి కోరింది. సౌదీలోని పౌరులు, పౌర మౌలిక వసతులపై దాడులకు బాధ్యులను జవాబుదారీ చేయాలని, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని కోరింది. ముఖ్యంగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం 2216ను అమలు చేయాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







