సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- September 20, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. ఇదే తీవ్రత మరో 5రోజులపాటు కొనసాచ్చని తెలిపింది.
NCM ప్రకారం.. భారీ వర్షం అంటే గంటకు 10–50 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ సమయంలో గంటకు 60 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు, దాదాపు సున్నా స్థాయికి పడిపోయే విజిబిలిటీ, వడగళ్ల వాన, ఆకస్మిక వరదలు, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ అలలు, కొన్ని సందర్భాల్లో టోర్నడోలు లేదా వాటర్‌స్పౌట్స్ సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
జజాన్, అసీర్, అల్-బాహాలో భారీ వర్షాలు
జజాన్ ప్రాంతంలోని అల్-రైత్, హరూబ్, అల్-దాయర్, అల్-ఈదాబీ, ఫైఫా, అల్-అరీదా, అల్-హర్త్, అల్-తువాల్, అల్-దర్బ్, బైష్, సబ్యా, దమాద్, అబూ అరీష్, అహద్ అల్-మసారిహా, సమ్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అసీర్ ప్రాంతంలో అబ్హా, ఖమీస్ ముషైత్, అహద్ రఫీదా, సరాత్ అబీదా, అల్-హరజా, ధహ్రాన్ అల్-జనూబ్, అల్-ఫర్షా, అల్-నమాస్, తనూమా, రిజాల్ అల్-మా, బారిక్, మహాయిల్ అసీర్, అల్-మజార్దా, బల్కర్న్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. **ఆదివారం, శుక్రవారం వర్షాల తీవ్రత పెరగవచ్చని NCM తెలిపింది.
అల్-బాహా ప్రాంతంలోని అల్-బాహా, బల్జురాషి, అల్-మందక్, ఖిల్వా, బనీ హసన్, అల్-ఖరా, అల్-అఖీఖ్, అల్-హజ్రా, ఘామిద్ అల్-జినాద్ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం వర్షాలు మరింత తీవ్రం కావచ్చని అంచనా.
మక్కా ప్రాంతంలోనూ వర్షాలు
మక్కా ప్రాంతంలోని తాయిఫ్, మైసాన్, అదమ్, అల్-అర్దియాత్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో అల్-కామిల్, బహ్రా, అల్-జుముమ్, ఖులైస్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని, సోమవారం, మంగళవారం వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని NCM పేర్కొంది.
మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు
మదీనా ప్రాంతం: మదీనా, అల్-ఉలా, ఖైబర్
నజ్రాన్ ప్రాంతం: నజ్రాన్, బదర్ అల్-జనూబ్, యదామా, థార్, హుబూనా, ఖుబాష్
ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని NCM అధికారిక మార్గాల ద్వారా తెలుసుకోవాలని, సంబంధిత అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







