అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- September 20, 2026
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ షాపింగ్ సేల్‌కు సిద్ధమవుతోంది. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ పేరుతో నిర్వహించే ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. వివిధ కేటగిరీల్లో ప్రత్యేక డీల్స్, డిస్కౌంట్లను అందించేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. ఈ సేల్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనం లభించనుంది. అర్హత ఉన్న లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే డిస్కౌంట్‌కు సంబంధించిన పూర్తి నిబంధనలు, పరిమితులు సేల్ సమయంలో వర్తించే అవకాశం ఉంది.
Prime సభ్యులకు అదనపు ఆఫర్లు
అమెజాన్ ప్రైమ్ సభ్యులను ఆకట్టుకునేందుకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రైమ్ సభ్యులకు కొన్ని డీల్స్ లేదా ప్రత్యేక ప్రయోజనాలను ముందుగా పొందే అవకాశం ఉండవచ్చని సంస్థ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా 8 PM Deals, Blockbuster Deals, Top 100 Deals, Mega Deals పేర్లతో ప్రత్యేక ఆఫర్లను అమెజాన్ అందించనుంది. దీంతో పండగ షాపింగ్ చేసే వినియోగదారులకు వివిధ రకాల డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.
Amazon Sale 2026: సేల్ ఎప్పటివరకు?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించినప్పటికీ.. సేల్ ముగింపు తేదీని మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. సేల్ ప్రారంభానికి దగ్గరలో మరిన్ని ఆఫర్లు, డీల్స్, నిబంధనలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు







