35 మంది కుర్దిష్ మిలిటంట్లను హతమార్చిన టర్కీ ఆర్మీ

- July 30, 2016 , by Maagulf
35 మంది కుర్దిష్ మిలిటంట్లను హతమార్చిన టర్కీ ఆర్మీ

సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో కల్లోలంగా మారిన టర్కీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. హక్కారీ ప్రావిన్స్‌లోని ఓ ఆర్మీ బేస్‌ను కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన మిలిటెంట్లు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ మిలిటరీ అధికారులు వెల్లడించారు.
కాగా.. హక్కారీ ప్రావిన్స్‌లో శుక్రవారం కూడా కుర్దిష్‌ మిలిటెంట్లు, ఆర్మీ జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందగా.. మరో 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com