క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్..

- July 30, 2016 , by Maagulf
క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్..

యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్ తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు.బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. x 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com