కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: డీజీపీ సాంబశివరావు
- July 30, 2016
కృష్ణా పుష్కరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రైవేటు వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఆపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని ప్రైవేటు వాహనదారులను కోరారు. పుష్కరాలకు వచ్చేవారికి అందుబాటులో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఘాట్ల వద్దకు వాహనాలు వెళ్లవని.. కిలోమీటర్ దూరంలోనే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సులు, పోలీసుల సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చేవారికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పసిపిల్లలు ఉన్న తల్లులు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







