ఆస్ట్రేలియా ఒలింపిక్ బృందానికి ముప్పు తప్పింది!
- July 30, 2016
ఒలింపిక్స్ లో పాల్గొనాలని బ్రెజిల్ వచ్చిన ఆస్ట్రేలియా ఒలింపిక్ బృందానికి ఓ ముప్పు తప్పింది. ఆసీస్ బృందం బసచేసిన బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా సిబ్బంది వారిని వెంటనే అక్కడి నుంచి తరలించింది. గ్రౌండ్ ఫ్లోరులో మంటలు ఆకస్మికంగా రావడంతో తమ బృందం కాస్త ఇబ్బంది పడిందని ఆసీస్ అధికార ప్రతినిధి మైక్ టాన్సర్డ్ తెలిపారు. 100 మంది అథ్లెట్లు సహా అధికారులు అక్కడ బస చేసినట్లు తెలిపారు.ఆటగాళ్ల కోసం మొత్తం 31 భవనాలలో ఏర్పాట్లు చేయగా, ఆసీస్ బృందం ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసిందని టాన్సర్డ్ వెల్లడించారు. రియో గేమ్స్ కు సమయం దగ్గర పడుతున్నా ఒలింపిక్ విలేజ్ లో వసతుల ఏర్పాట్లు పూర్తికాలేదని, వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఓ వైపు ఆస్ట్రేలియా ప్రతినిధి కిట్టీ చిల్లర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







