అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్
- February 10, 2026
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (అసలు పేరు రేష్మ–24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. కేరళ (Kerala)లో కాసర్కోడ్ నగర సమీపంలోని అద్దె క్వార్టర్స్‌లో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న చిన్ను పప్పు స్థానిక భాషలో వీడియోలతో ప్రసిద్ధి చెందింది.
కాసర్కోడ్ స్థానిక భాషా మాండలికంలో ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్థానిక వంటకాలు, భోజనం, ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె చేసే వీడియోలు వైరల్ అయ్యేవి. లక్షలాది మంది నెటిజన్లు ఆమె వీడియోలను వీక్షించేవారు. రేష్మ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం.. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కేవలం నెల రోజుల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల అనంతరం తలెత్తిన మనస్తాపం లేదా వ్యక్తిగత కారణాలేమైనా ఈ ఆత్మహత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదూర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







