ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- February 11, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభాపతి అధ్యక్షతన కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో, రాబోయే రోజుల అసెంబ్లీ కార్యక్రమాలు, చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టే సమయాలపై బీఏసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
అలాగే, సమావేశాల అజెండాను ఖరారు చేసి సభ్యులకు తెలియజేయనున్నారు.దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మార్చి 12వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







