కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- February 12, 2026
కొలకలూరి పురస్కారాలు గత 19 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేయబడుతున్నాయి. ఈ సంవత్సరం పురస్కారార్థం అందిన సుప్రసిద్ధ సాహిత్య స్రష్టల గ్రంథాలను న్యాయనిర్ణేతలు పరిశీలించి, వివిధ విభాగాలలో ఎంపికైన గ్రంథాలను ప్రకటించడం ఆనందదాయకమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం–2026 (మా అమ్మ)
న్యాయనిర్ణేతలు: డా॥ రాసాని వెంకట్రామయ్య, ఆచార్య జి. బాలసుబ్రహ్మణ్యం, ఆచార్య కె. లావణ్య.
- “ఏకలవ్య కాలనీ (ఎరుకల జీవన గాథలు)” – రచయిత పలమనేరు బాలాజీ – రూ.20,000/-
- “నల్లబంగారం” – రచయిత్రి స్వర్ణ కిలారి – రూ.10,000/-
కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం–2026 (మా నానమ్మ)
న్యాయనిర్ణేతలు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య కె. దామోదరనాయుడు, ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు.
- “ఏకుదారం (చేతివత్తుల సంతకం)” – రచయిత డా॥ బి. నాగశేషు – రూ.20,000/-
కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం–2026 (మా తాతయ్య)
న్యాయనిర్ణేతలు: ఆచార్య కె. శారద, ఆచార్య ఆర్. రాజేశ్వరమ్మ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
- “చెమట చెక్కిన వాక్యం” – విమర్శకుడు కెంగార మోహన్ – రూ.20,000/-
- “విస్తార” – విమర్శకుడు ఎం.వి. రామిరెడ్డి – రూ.10,000/-
న్యాయనిర్ణేతలకు కృతజ్ఞతలు తెలియజేసిన నిర్వాహకులు, పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. అలాగే తమ రచనలు పంపిన సాహితీ స్రష్టలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మా అమ్మ జయంతి, వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 26, 2026 సాయంత్రం 6 గంటలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి (హైదరాబాద్)లో పురస్కార ప్రదాన సభ నిర్వహించబడుతుంది.
--ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, 94419 23172 (పూర్వ వైస్ ఛాన్స్‌లర్, ద్రావిడ విశ్వవిద్యాలయం)
--ఆచార్య కొలకలూరి సుమకిరణ్, 99635 64664 (ఆంగ్లాచార్యులు, మెంబర్, ఇ.సి. డైరెక్టర్ పిఇటిసి, అధ్యక్షులు, బి.ఒ.ఎస్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







