మరో 6 భారీ పరిశ్రమలు ఏపీలో!
- July 30, 2016
పెట్టుబడులు, పరిశ్రమల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలోనే కాకుండా ఏపీలోని మిగిలిన జిల్లాల్లోనూ పరిశ్రమలు రావాలని ఏపీ సర్కారు చేసిన ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతం అవుతున్నాయి. తాజాగా మరో 6 భారీ పరిశ్రమలు ఏపీలో ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది.ఈ మూడు భారీ పరిశ్రమల్లో మూడు కర్నూలు జిల్లాలోనే ఏర్పాటుకాబోవడం విశేషం. మిగిలిన మూడింటిలో రెండు నెల్లూరు జిల్లాలోనూ.. మరొకటి విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఈ మేర నిర్ణయం తీసేసుకున్నారు.జైరాం ఇస్పాత్ లిమిటెడ్ తన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కర్నూలు జిల్లాలో రూ. 2, 938 కోట్లు పెట్టుబడితో ప్రారంభించబోతోంది. దీని ద్వారా వెయ్యిమందికిపైగా ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఎంపీఎల్ మినరల్ ప్రాజెసింగ్ లిమిటెడ్ కూడా తన స్టీల్ ప్లాంట్ ను కర్నూలు జిల్లాలో రూ. 687 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తుంది.900 కోట్ల పెట్టుబడితో శాంతారామ్ కెమికల్స్ కూడా కర్నూలు జిల్లాలో కెమికల్ ప్రాజెక్టు ప్రారంభిస్తుంది. వీటితో పాటు రెడ్సోస్ సీమ్ లెస్ సంస్థ, స్ధాన్ కోకాకోలా సంస్థలు నెల్లూరు జిల్లాలలోనూ... వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ విశాఖపట్నంలోనూ తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాయి. మొత్తం ఈ ఆరు పరిశ్రమలు ద్వారా రాష్ట్రానికి 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. మొత్తం 20 వేల మందికి ఉపాధికి దొరుకుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







