ఎ.ఆర్‌. రెహమాన్‌కు అరుదైన గౌరవం

- July 30, 2016 , by Maagulf
ఎ.ఆర్‌. రెహమాన్‌కు అరుదైన గౌరవం

ప్ర ముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెల 15న ఐక్యరాజ్యసమితి వేదికపై తన సంగీతం, గానంతో సమ్మోహితుల్ని చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రముఖ గాయని ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆమె 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గానమాధుర్యాన్ని వినిపించారు. ఇప్పుడు రెహమాన్‌కు ఆ అవకాశం దక్కింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్‌ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఇందులో రెహమన్‌ 'దిల్‌సే' పాటల నుంచి తాజా 'సరసరియా...'వరకు అద్భుతమైన పాటలతో అలరించనున్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'వేర్‌ ది మైండ్‌ ఈజ్‌ విత్‌ అవుట్‌ ఫియర్‌'ను సరికొత్తగా ఆవిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com