ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- February 18, 2026
ముంబై: భారతీయ జాతీయ సినీ అకాడమీ(INCA) ఈరోజు 2026 ఏప్రిల్ 15 & 16 తేదీలలో ముంబైలో జరగనున్న కళ్యాణ్ జ్యువెలర్స్ INCA అవార్డుల ప్రారంభ ఎడిషన్ తేదీలను ప్రకటించింది.ఈ అవార్డులు, భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి.
భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఒకే అకాడమీ కింద కలిపే తొలి జాతీయ వేదికగా INCA రూపుదిద్దుకుంది. భాషలు, ప్రాంతాలు మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, ప్రపంచ స్థాయి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ వేదిక రూపొందించబడింది. ఇకపై విడివిడిగా కాకుండా, భారతీయ సినిమా ఒకే సాంస్కృతిక శక్తిగా నిలబడే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL), SIIMA ప్రమోటర్లు విష్ణు వర్ధన్ ఇందూరి నాయకత్వంలో INCA ప్రారంభమవుతోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముఖ్య పేట్రన్‌గా వ్యవహరిస్తుండగా, అంతర్జాతీయ స్థాయి సినీ అకాడమీలా గుర్తింపు పొందేలా దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తొలి ఎడిషన్ కు కళ్యాణ్ జువెలర్స్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా చేరడం ఈ వేదికకు మరింత ప్రతిష్టను తెచ్చింది.
అకాడమీలా రూపొందించిన ఈ అవార్డుల్లో పారదర్శకత, విశ్వసనీయత, సహచరుల గుర్తింపు ప్రధానంగా ఉంటాయి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, భోజ్‌పురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, అస్సామీ, గుజరాతీ భాషల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ప్రదానం చేయబడతాయి. అదనంగా దర్శకత్వం, నటన, సంగీతం, టెక్నికల్ విభాగాలు, డెబ్యూ కేటగిరీల్లో ఆల్ ఇండియా స్థాయి అవార్డులు కూడా ఉంటాయి.
ఎంట్రీలకు ఆహ్వానం:
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నిర్మాతలు/దర్శకులు తమ చిత్రాలను సమర్పించవచ్చు.
• చివరి తేదీ: మార్చి 1
• ఆన్లైన్ సమర్పణ: http://www.INCA.in
INCA అవార్డ్స్ కేవలం ఒక పురస్కార కార్యక్రమం మాత్రమే కాదు, భారతీయ సినిమాను ఒకటిగా సలబ్రేట్ చేసుకునే నేషనల్ మూమెంట్ కి ఇది ఆరంభం. సరిహద్దులు లేని ప్రతిభను గౌరవిస్తూ, సహకారానికి పునాది వేసే కొత్త యుగానికి ఇది నాంది పలుకుతోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







