ఒమాన్ లో ఇప్పటివరకు 57,000 మంది పైగా శ్రామికుల పరారీ
- July 21, 2015
ఒమాన్ దేశంలో 2015 సంవత్సరం మొదటి 6 నెలల్లో, 57,420 మంది కార్మికులు తమ యజమానుల వద్దనుండి పారిపొయినట్టు, ఇది దేశవ్యాప్తంగా రేగిస్టార్ ఐన ప్రవాసీయుల సంఖ్యలో మూడవ వంతని, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు. ఈ సంఖ్యలు కలవరం కలిగిస్తున్నాయని, ఏవైనా సమస్యలుంటే మానవ వనరుల శాఖను సంప్రదించాలని, అధికారులు దీనికి దోవ తీసే మూలకారణాలను వెలికితీయాలని, మజ్లిస్ అల్ షురా సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, నిర్మాణ కంపెనీ యజమాని ఐన రషీద్ ఖల్ఫాన్ - ఈద్ పండుగ అని 3 రోజులు సెలవు ఇస్తే, వారికి ఒప్పందం ప్రకారం అన్ని మొత్తాలు చెల్లిస్తు న్నా కార్మికులు పారిపోయారని వాపోగా...యజమానుల దుష్ప్రవర్తన కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, వారి హక్కులను గౌరవించినాట్టైతే ఈ విధంగా జరగదని హెచ్. ఆర్. మానేజర్ - హుస్సైన్ అలీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష అవధి కేవలం 10 రోజులే ఉన్న నేపధ్యంలో ఈ విధంగా జరగడం గమనార్హం!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







