యాకూబ్ మెమన్‌కు మరణశిక్ష ఖాయమైపోయింది
- July 21, 2015
1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌కు మరణశిక్ష ఖాయమైపోయింది. తనకు విధించిన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీంకోర్టుకు అతడు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంతకుముందే నిరాకరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా జూలై 30న యాకూబ్‌ను ఉరితీసే అవకాశాలున్నాయి. మొత్తం 257 మందిని బలిగొన్న నాటి దారుణ మారణకాండకు యాకూబ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు రుజువు కావడంతో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. కిందటేడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. తాజా పరిణామంతో యాకూబ్‌ని ఉరితీసేందుకు నాగ్‌పూర్ జైలులో మహారాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







