గోధుమపిండి లడ్డు
- July 21, 2015
గోధుమపిండి లడ్డు
కావలిసిన పదార్ధాలు
గోధుమ పిండి - అరకిలో
పంచదార పొడి - పావుకిలో
నెయ్యి - అరకిలో
పాలు - రెండు టేబుల్ స్పూన్లు
శెనగపిండి - నాలుగు స్పూన్లు
యాలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు
గసగసాలు - కొద్డిగా
తయారీ విధానం
వెడల్పాటి బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, గోధుమపిండి తగినన్ని గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి.ఈ ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. బాణలిలో మిగిలిన నెయ్యి పోసి కాగాక ఈ ఉండల్ని వేసి సిమ్‌లో వేయించాలి. తరువాత వేయించిన ఉండలన్నింటినీ మెత్తగా చిదమాలి. అవసరమైతే రవ్వ జల్లెడతో జల్లించి ఇంకా గట్టిగా ఉన్న వాటిని మిక్సీలో వేయవచ్చు, సెనగపిండిలో ఓ టేబల్‌స్పూను నెయ్యి, గోరువెచ్చని పాలు పోసి బాగా కలపాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి ఈ పిండి మిశ్రమాన్ని వేయించి చల్లారాకా పొడి పొడిగా చేసి గోధుమపిండి మిశ్రమంలో కలపాలి. చివరగా పంచదార పొడి, యాలకుల పొడి వేసి తగినంత నెయ్యి వేసి లడ్డూల్లా చేసి చివరిగా వేయించిన గసగసాల్లో దొర్లిస్తే నోరూరించే గోధుమపిండిలడ్డూ రెఢీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







