మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- February 19, 2026
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా ఒక సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతూ, తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
కొత్త పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కవిత స్పష్టమైన గడువును నిర్ణయించారు. మే నెల మొదటి వారంలో శుభ ముహూర్తం చూసుకుని పార్టీ పేరు, జెండా, విధివిధానాలను బహిరంగంగా ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యంగా, తాను స్థాపించబోయే పార్టీ పేరులో కచ్చితంగా “తెలంగాణ” అనే పదం ఉంటుందని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
రాబోయే ఎన్నికల విషయంలోనూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని కేవలం స్థాపించడమే కాకుండా, ప్రత్యక్ష ఎన్నికల్లో తాను చురుకైన పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..









