ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- February 19, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో పౌరులు మరియు నివాసితులకు లావాదేవీలను సులభతరం చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనేక విభాగాలకు అధికారిక పనివేళలను ప్రకటించింది. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది.
జాతీయ గుర్తింపు కేంద్రాలతో పాటు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనలిటీ మరియు కువైట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ రెండు రోజువారీ షిఫ్టులలో పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సాయంత్రం సమయం రాత్రి 7:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు కార్యాలాయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
అలాగే, ట్రాఫిక్ లైసెన్సింగ్ విభాగం, ట్రాఫిక్ ఉల్లంఘనల దర్యాప్తు విభాగం మరియు డ్రైవింగ్ విద్య పరీక్ష విభాగాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పనిచేస్తాయి. సాంకేతిక తనిఖీ విభాగాలు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సేవలను అందిస్తాయని అన్నారు.
ఇక రమదాన్ సందర్భంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్వీస్ సెంటర్లు కూడా రెండు షిఫ్టులలో పనిచేస్తాయి. ఉదయం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:30 వరకు మరియు సాయంత్రం వేళలు రాత్రి 7:00 నుండి రాత్రి 11:30 వరకు ఉంటుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
సవరించిన షెడ్యూల్లు పవిత్ర మాసంలో సజావుగా సేవలను అందించడానికి మరియు ప్రజల అవసరాలను తీర్చడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
తాజా వార్తలు
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!







