ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- February 20, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’ విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందులో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. ఇక త్వరలోనే నైపుణ్య వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. పోర్టల్ కోసం ఇప్పటికే మాడ్యూల్స్ సిద్దం కాగా.. 25 రకాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది.
ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో రిజిస్టర్ అవ్వగా.. అభ్యర్థులు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించారు. 16 మంది రిక్రూటర్స్ సిద్దంగా ఉండగా.. 1,14,899 ఉద్యోగాలు సిద్దంగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఐటీఐలకు అనుబంధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు







