అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!

- September 28, 2026 , by Maagulf
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!

న్యూ ఢిల్లీ: అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలకమైన ఆర్థిక, సాధారణ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. అందులో భాగంగా గృహ వినియోగ డోమెస్టిక్ ఎల్పీజీ (LPG) వినియోగదారులు ఇకపై ప్రభుత్వం అందించే సబ్సిడీని పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో జమ కానుంది.

బ్యాంకు డిపాజిట్లపై ఆర్‌బీఐ నూతన రూల్స్
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను మరింత పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తంలో చేసే డిపాజిట్లకు సంబంధించి సంబంధిత బ్యాంకుకు చెందిన అన్ని బ్రాంచుల్లోనూ ఒకే రకమైన వడ్డీ రేటు వర్తించనుంది. డిపాజిట్‌దార్లకు స్పష్టతనివ్వడానికి ఈ నిబంధన ఉపయోగపడనుంది.

మరోవైపు జనన, మరణాల నమోదు ప్రక్రియ నిబంధనల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్ణీత గడువు దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకునే సందర్భాల్లో నిబంధనలను కఠినతరం చేశారు. ఒకవేళ జనన లేదా మరణ వివర నమోదు రెండేళ్లకు మించి ఆలస్యమైతే, నమోదు ప్రక్రియ కోసం ఇకపై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు పొందడం తప్పనిసరి కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com