ఉగ్రవాదులను తయారు చేయటానికి శిక్షణ..
- July 31, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తర్వాతి తరం ఉగ్రవాదులను తయారు చేయటానికి సిరియా, ఇరాక్లలో విదేశీ ఉగ్రవాదుల పిల్లలకు శిక్షణనిస్తోందని యూరోపోల్ తాజా నివేదిక వెల్లడించింది. వారు యూరప్‌కు తిరిగి వచ్చి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు దీర్ఘకాలంలో భారీ ముప్పుగా పరిణమించగలరని ఆందోళన వ్యక్తంచేసింది.బ్రిటన్‌కు చెందిన పిల్లలు 50 మందికి పైగా ఐసిస్ ఆధీనంలోని ప్రాంతంలో నివసిస్తున్నారని.. అలాగే మరో 32,000 మంది గర్భిణులు ఉన్నారని ఆ నివేదికను ఉంటంకిస్తూ ఇండిపెండెంట్ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఈ పిల్లలకు ఐసిస్ భావజాలాన్ని నూరిపోస్తూ పశ్చిమ దేశాల పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొంది. ఐసిస్‌లో చేరటానికి ఐదు వేల మందికి పైగా యూరోపియన్లు సిరియా, ఇరాక్‌లకు వెళ్లినట్లు యూరోపోల్ అంచనా.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







