డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- February 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు ఉపశమనం కలిగించేలా, అలాగే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేలా స్మార్ట్ కార్డుల జారీలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల స్థానంలో ఇకపై క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.
గతంలో తీసుకొచ్చిన చిప్ ఆధారిత విధానంలో ప్రతీ ఆర్సీ లేదా డీఎల్ స్మార్ట్ కార్డు కోసం రూ.200 ఫీజు, పోస్టల్ ఛార్జీలు రూ.35 కలిపి రూ.235 ముందుగానే వసూలు చేసేవారు. కానీ కార్డులు మాత్రం ఇళ్లకు వచ్చేవి కావు. ఆ తర్వాత 2023 నుంచి వాహనదారుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మానేసి, కార్డులు జారీ చేయడం కూడా మానేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాగానే 2024 అక్టోబర్ 1 నుంచి మళ్లీ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కానీ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు. చిప్ తో కూడిన కార్డుకు 115 రూపాయలు ఖర్చవుతుంటే క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డుకు 72 రూపాయలే ఖర్చవుతోంది. దీంతో పాటు చిప్ కార్డుల్లో డేటా రీడ్ చేయాలంటే మళ్లీ వాటికి రీడర్లు కొనాలి. క్యూఆర్ కోడ్ తో అయితే కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో లింక్ అయి ఉంటుంది. దీంతో క్యూఆర్ కోడ్ తో కార్డులే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2024 అక్టోబర్ 1 నుంచి ఇవ్వాల్సిన కార్డుల్ని జారీ చేస్తారు. అలాగే అంతకు ముందు కార్డులు కావాలంటే తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







