ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- August 07, 2026
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అనుమానిత ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి చెక్-ఇన్ లగేజీలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల భాగంలో అత్యంత చాకచక్యంగా దాచిన 24 క్యారెట్ల బంగారం 19 ముక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
లగేజీని ఎక్స్‌రే స్కానింగ్ చేయగా అనుమానాస్పద చిత్రాలు కనిపించడంతో అధికారులు క్షుణ్నంగా సోదాలు నిర్వహించారు. అనంతరం స్కూటర్ టైర్లలో దాచిన బంగారం బయటపడింది.
ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి, బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక







