అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- February 22, 2026
రియాద్: ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి వ్యాఖ్యలను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది . మొత్తం మిడిలీస్టుపై ఇజ్రాయెల్ నియంత్రణను ఆమోదయోగ్యమైనదిగా అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదస్పదం అయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవిగా పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ ప్రాంతంలోని దేశాలకు మరియు అమెరికాకు మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడం అన్ని సమస్యలకు పరిష్కారం అని మరోసారి సౌదీ అరేబియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్‌వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







