'జై హనుమాన్' పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్
- February 23, 2026
ట్రూ పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' చిత్రాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు దాని ప్రతిష్టాత్మక సీక్వెల్ 'జై హనుమాన్' కోసం సిద్ధమవుతున్నారు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో నెక్స్ట్ చాప్టర్. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది, దీనిని టి-సిరీస్ సమర్పిస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా నటిస్తున్నారు.
జాతీయ అవార్డు విజేతలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక కలయిక, భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘జై హనుమాన్’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలబెట్టింది. ఆధునిక కథనాలను పురాణ అంశాలతో సమ్మిళితం చేస్తూ అద్భుతమైన, వినూత్నమైన కథలతో ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ తమ బ్లాక్‌బస్టర్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘కాంతార చాప్టర్ 1’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రిషబ్ శెట్టి ఈ చిత్రంలో నటించడం అంచనాలను మరింత పెంచింది.
ఈ చిత్రాన్ని ఈ రోజు విజయనగరంలోని హంపిలోని అంజనాద్రి బెట్టలో ఘనంగా ప్రారంభించారు. ఈ పవిత్ర స్థలం హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించబడుతుంది. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, అనిల్ థడాని ఫస్ట్ షాట్‌కు కెమెరా రోల్ చేశారు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. అనిల్ థడాని, భూషణ్ కుమార్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి దర్శకుడు ప్రశాంత్ వర్మకు స్క్రిప్ట్‌ను అందజేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
రిషబ్ శెట్టిని హనుమంతుడిగా పరిచయం చేస్తూ ఇపటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా స్పందన లభించింది. ఆ పాత్రను నిజాయితీగా ఆవిష్కరించేందుకు ఆయన ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.
‘జై హనుమాన్’ కలియుగం నేపథ్యంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిక్. హనుమంతుడి మౌనం ఓటమి కాదు, ఒక లక్ష్యంతో కూడిన నిశ్చలత అని, సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చే అపార శక్తిని ప్రతిబింబిస్తుంది, అచంచల భక్తి, విశ్వాసం, శాశ్వత బలానికి నివాళిగా ఈ సినిమా నిలవనుంది.
ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో రూపొండుతున్న ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు, ఎస్. తిరునావుక్కరసు సినిమాటోగ్రాఫర్, శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: రిషబ్ శెట్టి
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
ప్రజెంట్: టి సిరీస్
డిఓపి: ఎస్ తిరునావుక్కరసు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









