'డెకాయిట్' ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న రిలీజ్
- February 23, 2026
ఇప్పటి వరకు హై వోల్టేజ్ యాక్షన్‌తో అలరించిన 'డెకాయిట్' మేకర్స్, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
'డెకాయిట్' ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్ పోస్టర్ లో శేష్ ప్రశాంతమైన కానీ ఇంటెన్స్ లుక్‌లో ఉండగా, మృణాల్ సున్నితమైన నవ్వుతో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే సినిమా లోని యాక్షన్ నేపథ్యానికి సమాంతరంగా ఓ టెండర్ రొమాంటిక్ ట్రాక్ నడుస్తుందనే అర్ధమౌతుంది.
డెకాయిట్ కథ డేంజర్, రా యాక్షన్ చుట్టూ తిరిగినా “రుబారూ” మాత్రం ఎమోషనల్ టచ్‌తో కొత్త ఫీల్ ఇవ్వబోతుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ, వారి ప్రయాణాన్ని ఈ పాట ప్రజెంట్ చేయబోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ ఆల్బమ్‌పై ఇప్పటికే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న డెకాయిట్ పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







