NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- February 26, 2026
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రవాస తెలుగు వారి సంక్షేమం కోసం నిరంతరం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా'ఆస్క్ ఆన్ అటార్నీ' పేరుతో ఆన్లైన్ వెబినార్ నిర్వహించింది.ఇమ్మిగ్రేషన్, వీసా సంబంధిత క్లిష్టమైన సమస్యల పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సుమారు 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి కిరణ్ మందాడి అనుసంధాకర్తగా వ్యవహరించి చర్చను సమర్థవంతంగా నడిపించారు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి న్యూ జెర్సీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి తోడ్పాటుతో ఈ వెబినార్ మరింత ఉపయుక్తంగా సాగింది.
ప్రస్తుత మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనల గురించి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను ఇలింద్ర సుదీర్ఘంగా వివరించారు.ముఖ్యంగా ఈ నెల విడుదలైన వీసా బులెటిన్ లోని మార్పులను విశ్లేషించడంతో పాటు, రాబోయే 2026 హెచ్-1బి ఫైలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన కొత్త నిబంధనలపై ప్రవాసులకు స్పష్టతనిచ్చారు. అనంతరం గంటకు పైగా సాగిన ప్రశ్నోత్తరాల సెషన్లో అటార్నీ భాను ఓపికగా సమాధానాలిచ్చారు.ఈబీ-5 గ్రీన్ కార్డ్ విధానం, స్టేటస్ మార్పు, వేతనాల వర్గీకరణ, అడ్వాన్స్ పెరోల్ ద్వారా ప్రయాణాలు, వీసా అపాయింట్మెంట్ స్లాట్ల లభ్యత,హెచ్-4 వీసా ఫైలింగ్ వంటి అనేక అంశాలపై ఉన్న స్పష్టమైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిల మార్గదర్శకత్వంలో జరిగింది.నాట్స్ నాయకులు శ్రీకాంత్ పొనకాల,రాకేష్ వేలూరు, శ్రీనివాస్ మెంటా తదితరుల సమన్వయం ఈ సదస్సుకు బాగా దోహదపడింది.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









