TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- February 27, 2026
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (TG Govt) పౌర సేవలను మరింత చేరువ చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవ ఆధ్వర్యంలోని ‘మీ టికెట్’ (Mee Ticket) మొబైల్ యాప్‌లో టీజీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌ల సేవలను అనుసంధానించింది. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు బస్‌పాస్‌ల కోసం గంటల తరబడి డిపోల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది.
ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ ద్వారా నేరుగా బస్‌పాస్‌లను జారీ చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు కేవలం నగర బస్‌పాస్‌లే కాకుండా, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటు కలిగింది.డిజిటలైజేషన్ దిశగా ఆర్టీసీ వేసిన ఈ అడుగు ప్రయాణికులకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.
డిజిటల్ పాస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ యాప్‌లో అత్యాధునిక సాంకేతికతను జోడించింది. ఇందులో డైనమిక్ క్యూఆర్ కోడ్ (Dynamic QR Code), లైవ్ వాలిడిటీ సూచిక, భద్రత కోసం స్క్రీన్‌షాట్ నిరోధక (Anti-screenshot) వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఒకరి పాస్‌ను మరొకరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







