ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- February 28, 2026
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19వ సీజన్) ప్రారంభ తేదీలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.తొలుత ఈ మెగా టోర్నీని మార్చి 26 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ, వివిధ కారణాల వల్ల దీనిని రెండు రోజులు వెనక్కి జరిపినట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఐపీఎల్ 2026 మార్చి 28న ఘనంగా ప్రారంభం కానుంది. మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మార్పు చేయడానికి ప్రధాన కారణం ఫ్రాంచైజీలకు,ఆటగాళ్లకు తగినంత సమయం ఇవ్వడమేనని తెలుస్తోంది. వరుస సిరీస్‌ల వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా, టోర్నీ ప్రారంభానికి ముందు తగినంత విశ్రాంతి, సన్నాహక సమయం కల్పించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ రెండు రోజుల గడువు వల్ల జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి మరింత సమయం దొరకనుంది.
అయితే ఈ నిర్ణయంపై ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే వారంలో బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ ఫో పేర్కొంది. పూర్తి స్థాయి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఆ రోజే వెల్లడించే అవకాశం ఉంది.అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తేదీలపై స్పష్టత రానందున బీసీసీఐ వేచి చూస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి ఉన్నాయి.అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు గౌహతి రెండో హోంగ్రౌండ్. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలకు అనుగుణంగా మ్యాచ్ తేదీలను ఖరారు చేయడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే షెడ్యూల్ రెండు దశల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







