బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడు
- July 31, 2016ఒక చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమా బిచ్ఛగాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ వంద రోజుల వేడుకకి రెడీ అవుతుంది. అయితే డబ్బింగ్ సినిమా కావటంతో ఈ మూవీకి నిర్మాత సైతం తక్కువ పబ్లిసిటీని ఇచ్చారు. ఇక మార్కెట్ లో ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే లాభీయింగ్ చేసి మరీ యాడ్స్ తెచ్చుకునే మీడియా సైతం ఈ మూవీని అంతగా పట్టించుకోలేదు.ఒక్కసారిగా ఈ మూవీకి వచ్చిన సక్సెస్ ని చూసిన మీడియా యాడ్స్ కోసం వెంట పడింది. అప్పటికే ఈ మూవీ 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకుంది. మొదట్లోనే మీడియాకి యాడ్స్ ని ఇవ్వని నిర్మాత, 50 రోజుల వేడుక తరువాత అక్షింతలు వేసినట్టుగా కొద్ది ఛానల్స్ కి మాత్రమే యాడ్స్ ని పరిమితం చేశాడు. ఇప్పుడు ఈ మూవీ 100 రోజులు వేడుకకి రెడీ అవుతుంది.200 థియేటర్లలో 75రోజులను ముగించుకొని ఈ ప్రయాణం కొనసాగుతుంది. దీంతో మీడియా బిచ్ఛగాడు 100 రోజుల వేడుకకి భారీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిర్మాత మాత్రం మీడియాకి చుక్కలు చూపిస్తున్నారు. బిచ్ఛగాడు కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయిన సినిమా, ఏ ఛానల్ కి యాడ్స్ ని ఇవ్వలేదు.ఇప్పుడు కూడ అనవసరం అంటూ మీడియాని దూరం పెడుతున్నారంట. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా రిపోర్ట్స్ బయటకు చెప్పుకోవటం విశేషం. ఏదైమానా బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ హీరో తెలుగులో డైరెక్ట్ మూవీకి రెడీ అవ్వటం విశేషం.
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం