డాక్టర్ వడ్డి.సురేష్ నాథ్ రెడ్డి తో ముఖాముఖి

- July 31, 2016 , by Maagulf
డాక్టర్ వడ్డి.సురేష్ నాథ్ రెడ్డి తో ముఖాముఖి

చూపుల్లో నాన్నతత్వం,మాటల్లో అమ్మతత్వం మరియు తనచేతల్లో దైవత్వం కలిగున్న మనకలియుగ దైవం,అందరిని ఆప్యాయంగ పలకరిస్తు,మనం చెప్పే సమస్యల్ని ఓపిగ్గ వింటూ చిరునవ్వుతో స్వాగతించే డాక్టర్ గారు మాట్లాడితే మనలో ఉండే జబ్బుకూడ భయపడుతుంది.అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం మరియు మనసున్న మానవత మూర్తి,అబుధాబిలో వెలిచిన ఆణిముత్యం వలస తెలుగు కార్మికులకు ఆరాధ్యదైవం శ్రీ డాక్టర్ వడ్డి.సురేష్ నాథ్ రెడ్డి గారితో "ముఖాముఖి​"   

Q1.మీ నేటీవ్ మరియు మీ కుటుంబం గురించి తెలుపండి?    
ఆ1.పేరు:సురేష్ నాథ్ రెడ్డి.సతిమణి,లక్ష్మి మరియు ఒక బాబు(శ్రీరాం),పాప(జహ్నవి). తండ్రి గారు,సుబ్బరెడ్డి మరియు అమ్మగారి పేరు సరస్వతమ్మ.  
పుల్లంపేట్ మండలం;దృక్పాదం వైఎస్ఆర్ జిల్లా.
నీవసం: అబు ధాబి(యూ ఏ ఈ
)
వృత్తి: డాక్టర్ - న్యూ మెడికల్ సెంటర్ అబు ధాబి.        

Q2.వైద్య వృత్తిని ఎంచుకోగలడానికి గల కారణం?
ఆ2.చిన్నప్పటినుండి సామజిక సేవచెయ్యాలనే బలమైన దృకల్పముండేది,మనిషి మనిషికి సేవచేసినప్పుడే మానవత్వం మరియు మానవజన్మకు అర్థం. మరియు మా నాన్న గారి కోరిక కూడా.

Q3.మీరు మెడిసన్ చదివేటప్పుడు ఎదురుకొన్న పరిస్థితులు? 
ఆ3.మెడిసన్ ఎంటర్ అయ్యాక నాన్న గారు స్వర్గస్థులైనారు, మెడిసన్లో సీటు సంపాదించి మెడికల్ కాలేజ్లో జైన్ అయ్యను కాని చదువడానికి డబ్బులులేవు మరియు డబ్బులు సర్దడానికి నాన్న గారు లేరు,అదినాకు మరో అగ్ని పరీక్ష.ఎలాగైన డబ్బులు సమకూర్చాలనే దృడమైన సంకల్పంతో ముందుకు సాగాను. లోన్స్ అక్కడ ఇక్కడ డబ్బులు పోగు చేసి తల్లితండ్రుల ఆశీర్వాదంతో మరియు దేవునిదయతో మెడిసన్ పూర్తి చేసాను.  
 
Q4.మీరు తలుచుకుంటే ఇండియాలో హాస్పిటల్ నడుపగలరు,కాని మీ వృత్తిని గల్ఫ్ దేశంలో కొనసాగించటానికి గలకారణం?  
ఆ4.వృత్తి రిత్య గల్ఫ్ వచ్చి ఎన్ ఎం సి హాస్పిటలో ఇన్సురెన్స్ విభాగంలో చేరాను. ఇక్కడ ఎందరో గల్ఫ్ కార్మికులు రకరకాల అనరోగ్యాలతో బాదపడుతున్నారు మరియు అందులో మన "తెలుగు" కార్మికులు చాల ఎక్కువగ నా దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు. ఇక్కడున్న "తెలుగు" కార్మికుల అనుబంధంతో మరియు వారికి సేవ చెయ్యలనే బలమైన కోరిక నన్ను ఈరోజు ఇలా మీముందు. మరియు ఒక డాక్టర్ ఇండియాలో స్వొంత హాస్పిటల్ పెట్టలంటే ఈరోజుల్లో చాల సులువైన పనినే కాని హాస్పిటల్ పెట్టినంక ఆ డబ్బులన్ని రోగిపైన తియ్యాలి అందుకే స్వొంతగా హాస్పిటల్ పెట్టే ఆలోచన నాలో లేదు.

Q5.వైద్యుడు కనిపించే దైవమంటారు, ఈరోజుల్లో తమ వైద్యవృత్తిని ఎలా నిర్వర్థించాలో తెలుపగలరా?  
ఆ5.ప్రతి వైద్యుడు,పేషెంటే తమ దేవుడని తమవృత్తినే దైవమని బావించాలి మరియు డాక్టర్ ని నమ్మి మనదగ్గరకు వస్తున్నారంటే అది పేషెంట్ యొక్క గొప్పతనంగ బావించాలి. మరియు మనోదైర్ణాన్ని ఇస్తూ డాక్టరంటే ఓ "భరోసా" అనే విదంగా పేషెంట్ తో ప్రవర్తించాలి.   

Q6.వైద్యానికి డబ్బులులేక ప్రస్థుతరోజుల్లో పేదవారెందరో చచ్చిబ్రతుకుతున్నారు మరియు మరణిస్తున్నారు,అలాంటి అనాదలకోసం మీరు,మీయొక్క వైద్యవృత్తికి మరియు వైద్యులకు సలహాలు సూచనలు?
ఆ6.చావుబ్రతుకుల్లో పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకొస్తే మొదట పేషెంట్ ని ప్రమాదకరమైన స్థితి నుండి నార్మల్ స్థితికి తెచ్చి తరువాత డబ్బుల గురించి ఆలోచించాలి. మరియు ప్రస్థుతం మా ఎన్ ఎం సి హాస్పిటలో మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.శెట్టి గారు  చెపుతుంటారు "ఫస్ట్ ట్రీట్మెంట్ దెన్ మని". ఇలాంటి హాస్పిటలో లో నా వైద్య వృత్తిని నిర్వర్థించడం నా అదృష్టం.

Q7.గల్ఫ్ దేశాల్లో కార్మికులు చాల వరకు ధీర్ఘ కాలిక రోగాలతో బాదపడుతున్నారు, వారికి మీ సలహాలు మరియు సూచనలు?
ఆ8.చాల వరకు ఆరోగ్య సమస్యలు వచ్చేది మనం తీసుకునే అహారం మరియు మనలో ఉండే అలవాట్ల వళ్ళా.మనం సరైన పద్దతిలో అహారం తీసుకుంటే అనరోగ్యం మన దరికి చేరదు.  
ఇక్కడ కొన్ని సూచనలు మరియు తీసుకొనవల్సిన జాగ్రత్తలు:  
1.సుగర్ వ్యాది:తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు లో కాలరీస్ ఫూడ్,కూరగాయలు మరియు రా ఫ్రూట్స్ తినాలి.  
2.హైపర్ టెన్సన్:ఉప్పు తక్కువగ ఉన్న అహారం తీసుకుంటు,నాన్ వెజిటేరియన్ ఫూడ్స్ అవైడ్ చేస్తు మరియు ప్రతిరోజు 45 మినట్స్ వ్యాయమం తప్పని సరిగ చెయ్యాలి.అధిక బరువుంటే,బరువుని తగ్గించుకోవాలి. 
3.హైపర్ కొలెస్ట్రాల్:రోజు మనం తీసుకునే అహారంలో ఆయిల్ ఫూడ్స్,నాన్-వెజ్ ఫూడ్స్ మరియు రొయ్యలు అవైడ్ చేస్తు వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తీసుకుంటు, తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయమం చెయ్యాలి.
4.హార్ట్ డిసేస్ మరియు స్ట్రోక్(పారలైసిస్):నాన్-వెజ్,సాల్టి,స్వీట్ ఫూడ్స్ రేడ్యూస్ చేస్తు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అలాగే (సుగర్ వ్యదిలేకుంటే)పండ్లుకూడ ఎక్కువగా తీసుకోవాలి,స్మోకింగ్ మరియు మద్యపానము అలవాటుంటే మానేయాలి అలాగే ప్రతిరోజు తప్పనిసరిగా 45 మినట్స్ వ్యాయమం చెయ్యాలి. 
5.కిడ్ని స్టోన్స్:ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్లు నీరు తాగాలి.
6.ఎండలో పని చేసేవారు తరచుగా నీరు తాగుతు మరియు నీళ్ళలో సుగర్ మరియు ఉప్పు వేసుకోని తాగాలి.
7.ఎసిడిటి(అల్సర),బ్లోటింగ్,గాస్ట్రిక్ ,రెఫ్లుక్ష్ డిసెస్:స్పైసి,ఆయిల్,ఫ్రైడ్, స్వీట్స్ మరియు నాన్ వెజ్ ఫూడ్స్ మానేసి,వెజిటేరియన్ మరియు ఫ్రూట్స్ తినాలి. 
8.మలబద్దకం:తరుచు ఆకు కూరలు,ఫ్రూట్స్,గ్రేవి ఫూడ్స్ మరియు ఎక్కువగ ఫ్లూడ్స్ తీసుకోవాలి. అలాగే మాంస హారము మరియు డ్రై ఫూడ్స్ అవైడ్ చెయ్యాలి.
9.అష్తమ మరియు అలెర్జిక్ రైనిట్స్:కూల్ డ్రింక్స్,కూల్ వాటర్,చల్లని పదార్థాలు మరియు దుమ్మి దూలి వాతవరణంలో వర్క్ ని అవైడ్ చెయ్యాలి.
10.డ్రై ఇట్చి స్కిన్ డిసెస్:మోయిస్టురిసింగ్ క్రీం ప్రతిరోజు రెండు లేద మూడు సార్లు పెట్టాలి మరియు సబ్బులు తక్కువగా వాడాలి.తరుచుగా వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ (సుగర్ వ్యాది లేనివాళ్ళు) తీసుకోవాలి.ఎక్కువగ ఫ్లూడ్స్ తాగలి.అలాగే స్మోకింగ్ మద్యపానము మానేసి, స్పైసి మరియు నాన్-వెజ్ అవైడ్ చెయ్యాలి.
11.ప్రతిరోజు ప్రతి ఒక్కరు 30 మినట్స్ నుండి 45 మినట్స్ వరకు వ్యాయం తప్పని సరిగ చెయ్యాలి.రోజు వారిజీవితంలో ప్రతి మనిషికి అహారం ఎంత అవసరమో, వ్యాయమం అనేదికూడ అంత ముఖ్యం. 

దన్యవాదలు సర్, మీ అముల్యమైన సమయాన్ని మాకు కేటాయించి,ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సలహాలు మరియు సూచనలు ఇచ్చినందుకు కృతఘ్నతలు.  
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com