ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- March 01, 2026
అమెరికా: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక సాహసించి దాడులు కొనసాగిస్తే, ఆ దేశం “చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని” భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విమాన వాహక నౌకలు ఇప్పటికే మధ్యధరా సముద్రంలో మోహరించాయి.
ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందించారు. ‘‘ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనుక సాహసిస్తే, మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









