ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- March 01, 2026
యూఏఈ: ఎయిర్‌స్పేస్ మూసివేతల కారణంగా ఎమిరేట్స్ మార్చి 1 వరకు దుబాయ్‌కు వచ్చే మరియు బయలుదేరే అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాబోయే 72 గంటల్లో ప్రయాణించడానికి బుక్ చేసుకుంటే, ప్రత్యామ్నాయ విమానంలో రీబుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రయాణ తేదీ నుండి 10 రోజుల వరకు మీరు వెళ్లాల్సిన గమ్యస్థానానికి మరొక విమానంలో రీబుక్ చేసుకోవచ్చని తెలిపారు. మీరు ట్రావెల్ ఏజెంట్‌తో మీ విమానాన్ని బుక్ చేసుకుంటే, వెంటనే వారిని సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని ఎమిరేట్స్ అధికారులు సూచించారు.
ఎమిరేట్స్ వద్ద నేరుగా బుక్ చేసుకుంటే, రీఫండ్ కోసం దరఖాస్తు చేయాలన్నారు. మీరు ట్రావెల్ ఏజెంట్ ద్వారా విమానాలను బుక్ చేసుకుంటే, వారినే సంప్రదించాలని కోరారు. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేయాలని కోరారు. విమాన రద్దుల వల్ల ప్రభావితమైన కస్టమర్‌లు రీబుకింగ్ కోసం వారి ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించాలి. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







