డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- March 01, 2026
హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వర్గాల్లో కలకలం రేపాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో చనువుగా మెలుగుతున్నట్లు చూపించే వీడియోలు ఇటీవల ఎక్స్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వీడియోలు నిజమా కాదా అన్న చర్చ నడుస్తున్న సమయంలో బీఆర్ నాయుడు స్వయంగా స్పందించి అవి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలేనని స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో తన రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా అనుకరించి, అసత్య దృశ్యాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలు పూర్తిగా వక్రీకరించినవని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను కూడా దిగజార్చే కుట్రలో భాగమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వ్యాప్తి చెందడంతో కొందరు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం బీఆర్ నాయుడు అధికారికంగా స్పందిస్తూ, తనపై జరుగుతున్నది దుష్ప్రచారమని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు వ్యక్తులు ఈ వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తరింపజేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఈ ఆరోపణల పై సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రూపొందించిన ఈ వీడియోలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు. డీప్‌ఫేక్ సాంకేతికత ద్వారా తప్పుడు వీడియోలు సృష్టించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఇటీవల కాలంలో పెరుగుతున్న పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిని వదిలేది లేదని ఆయన గట్టిగా చెప్పారు
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







